నిఖిల్…ఓపెనింగ్స్ ఉన్న హీరో!

- Advertisement -
Nikhil Siddharth Openings

హీరో నిఖిల్ సిద్ధార్థ్ కి ‘కార్తికేయ 2’ సినిమాతోనే మార్కెట్ పెరిగింది. ఆ సినిమా అనూహ్యంగా హిందీలో ఆడింది. దాంతో, నిఖిల్ సిద్ధార్థ్ సినిమాలకు ఇప్పుడు మంచి బిజినెస్ అవుతోంది. ఐతే, ఒక హీరోకి స్టార్ డంకి రావాలంటే అతను తన సినిమాకి మొదటి రోజు జనాలని రప్పించగల సత్తాని నిరూపించుకోవాలి.

‘కార్తికేయ 2′ సినిమా తర్వాత ’18 పేజెస్’ అనే సినిమా విడుదలైంది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. అంతే కాదు, ఆ సినిమాకి భారీ ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. దాంతో, నిఖిల్ సిద్ధార్థ్ గ్రాఫ్ పెరగలేదు అనిపించింది.

ఐతే, తాజాగా విడుదలైన ‘స్పై’ సినిమాకి అంచనాలను మించి ఓపెనింగ్స్ వచ్చాయి. అతని కెరీర్ లోనే అతిపెద్ద ఓపెనింగ్ వచ్చింది. తెలుగునాటే కాదు అమెరికాలో కూడా మొదటి రోజు భారీగా వసూళ్లు దక్కాయి.

“స్పై” సినిమాకి రివ్యూస్ బ్యాడ్ గా వచ్చాయి. సినిమాకి మౌత్ టాక్ కూడా మిక్సెడ్ గానే ఉంది. సినిమా ఫలితం పక్కన పెడితే… సరైన సినిమా పడితే పెద్ద హిట్ కొట్టగలను అని నిఖిల్ ప్రూవ్ చేశాడు. ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ తెప్పించాడు.

ఐతే, పాన్ ఇండియా మార్కెట్ మాత్రం ఇంకా స్థిరపడలేదు. ‘కార్తికేయ 2’ తర్వాత పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ‘స్పై’కి హిందీలో వచ్చిన స్పందన, కలెక్షన్ నిల్. తెలుగు మార్కెట్ వరకు మాత్రం నిఖిల్ గ్రాఫ్ పెరిగింది. ఓపెనింగ్స్ గట్టిగానే తీసుకొచ్చే హీరో అనే ఇమేజ్ తెచ్చుకున్నాడు.

More

Related Stories