‘లోకల్’ మేటర్ లేదా నిఖిల్!

- Advertisement -
Nikhil Us

హీరో నిఖిల్ కి కోపం వచ్చింది. ఎవరిపై? అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై హీరో నిఖిల్ కి ఆవేశం వచ్చింది. ఎందుకంట? ఆఫ్గానిస్తాన్ లో జరుగుతున్నా పరిణామాలు చూసి నిఖిల్ కలత చెందారు. దాంతో తాను కూడా ట్వీట్ వేశాడు. దాదాపు సెలెబ్రిటీలు అందరూ ఆఫ్గాన్ లో పరిస్థితులపై ఆవేదనతో పోస్టులు పెడుతున్నారు. కానీ నిఖిల్ వాడిన పదాలు, భాష విషయంలో భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి.

‘‘21 ఏళ్లు అనేక ఇబ్బందులకు గురి చేసి… చివరకు వదిలేసి వెళ్లిపోయారు. మిస్టర్ బైడెన్ ఇంకోసారి ఫ్రీడమ్ గురించి మాట్లాడితే చెప్పు తెగుద్ది యెదవ,” ఇలా ట్వీటాడు నిఖిల్. అమెరికా అధ్యక్షుడిని “ఎదవ” అని అనడం, “చెప్పు తెగుద్ది” అనడంతో నిఖిల్ సిద్ధార్థ్ పై విమర్శలు కూడా ఎక్కువ అయ్యాయి.

ఇంత ఆవేశం మన “లోకల్” సమస్యలపై కూడా చూపెడితే బాగుంటుంది అని కొందరు సలహా ఇస్తున్నారు. బైడెన్ ని తిట్టినట్లు మన దేశపు ‘ప్రధాన’ నాయకులను కూడా తిట్టొచ్చు కదా భయ్యా అని మరికొందరు దెప్పిపొడుస్తున్నారు. ఈ సలహాలు విని నిజంగానే మన నాయకులను ఆవేశంలో తిడితే నిఖిల్ ఆ తర్వాత సినిమాలు చేసుకోవడం కష్టం అవుతుంది.

నిఖిల్ ప్రస్తుతం “కార్తికేయ 2”, “18 పేజెస్” సినిమాల్లో నటిస్తున్నాడు.

More

Related Stories