నిఖిల్ మరో రిలీజ్ డేట్ ఫిక్స్

వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు నిఖిల్. దీంతో అతడి సినిమాల విడుదల తేదీలపై సందిగ్దత నెలకొంది. అతడి సినిమాలతో, అతడికే పోటీ మొదలైంది.

ఈ క్రమంలో ‘కార్తికేయ-2″, “స్పై” లాంటి సినిమాల విడుదల తేదీల్ని ముందుగానే ప్రకటించారు. అలా పోటీ మొదలైంది. ఈ మొత్తం వ్యవహారంలో నిఖిల్ చేస్తున్న “18-పేజెస్” అనే సినిమా వెనకబడింది. ఇప్పుడీ సినిమాపై కూడా క్లారిటీ వచ్చింది.

సరోనా/లాక్ డౌన్ కారణంగా గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై చేస్తున్న సినిమాలన్నీ ఆగిపోయాయి. దీంతో వాటి రిలీజ్ డేట్స్ ప్రకటించలేదు. అలా “18-పేజెస్” సినిమా కూడా ఆగిపోయింది. ఇప్పుడీ సినిమాకు విడుదల తేదీ ప్రకటించాడు నిర్మాత బన్నీ వాసు. సెప్టెంబర్ 10న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించాడు.

దీంతో నిఖిల్ సినిమాలకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చేసింది. “కార్తికేయ2″, స్పై”, “18 పేజెస్” సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చేశాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమా రిలీజ్ డేట్ మాత్రం రావాల్సి ఉంది.

 

More

Related Stories