గ్రామాల్లో వ్యాక్సిన్లు వేయిస్తా: నిఖిల్

Nikhil Siddharth

ఆ లాక్డౌన్ టైంలో హీరో నిఖిల్ చేసిన సేవ మెచ్చుకోతగిందే. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని ఎందరో కోవిడ్ బాధితులను ఆదుకున్నాడు. తనకు చేతనైన సాయం చేశాడు. ఇప్పుడు వ్యాక్సిన్లు కూడా వేయిస్తాడట. గ్రామాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడుతాను అంటున్నాడు.

“కరోనా వైరస్ పై మనం చేసే పోరాటానికి మనకు ఉన్న ఏకైక ఆయుధం వాక్సినేషన్ మాత్రమే. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నారు . అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా వ్యాక్సినేషన్ జరుగుతుంది. సాధ్యమైనంత త్వరగా వాక్సినేషన్ వేయించుకొండి. మా వంతుగా ప్రతివారం ఒక గ్రామానికి వెళ్లి ఫ్రీ వ్యాక్సినేషన్ వేస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే వ్యాక్సినేషన్ వేయించుకోవాలి అనుకుంటున్నారో.. ActorNikhil ఇన్స్టా అకౌంట్ లో ట్యాగ్ చేస్తే మా టీమ్ వ్యాక్సిన్ వేయించడానికి ప్రయత్నిస్తుంది,” అని వీడియో ద్వారా తెలిపాడు నిఖిల్.

నిఖిల్ నటించిన ’18 పేజెస్’, ‘కార్తికేయ 2’ సెట్స్ పై ఉన్నాయి.

More

Related Stories