‘నిశ్శబ్దం’గా ఆ డీల్ కూడా క్లోజ్

“నిశ్శబ్దం” సినిమా రిలీజ్ సందర్భంగా ఎంత హంగామా జరిగిందో అందరం చూశాం. అది ఓటీటీలో రిలీజ్ అవుతుందని మీడియా, అవ్వదని మేకర్స్ ఎప్పటికప్పుడు స్టేట్ మెంట్స్ ఇస్తూ వచ్చారు. చివరికి మీడియా ఊహించిందే నిజమైంది. సైలెంట్ గా “నిశ్శబ్దం” సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

రిలీజైన తర్వాత ఆ సినిమా  టైటిల్ కు తగ్గట్టే పెద్దగా చప్పుడు చేయలేకపోయింది. అది వేరే విషయం. ఇప్పుడీ మూవీ నిశ్శబ్దంగా మరో డీల్ పూర్తిచేసుకుంది. అదే శాటిలైట్ రైట్స్. తాజాగా ఈ సినిమా శాటిలైట్ డీల్ పూర్తయింది. జీ తెలుగు ఛానెల్ ఈ మూవీ ప్రసార హక్కులు దక్కించుకుంది.

మూగ-చెవిటి అమ్మాయిగా అనుష్క నటించిన “నిశ్శబ్దం” సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. అంజలి, షాలినీ పాండే, మాధవన్, సుబ్బరాజు ఇతర కీలక పాత్రలు పోషించారు. కోన వెంకట్ ఈ ప్రాజెక్టుకు క్రియేటివ్ ప్రొడ్యూసర్.

Related Stories