
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హీరో నితిన్ వీరాభిమాని. ఇక ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తోంది. దాంతో నితిన్ కి రాజకీయాల ప్రశ్న ఎదురైంది. ఒక విధంగా అతనికి ఇది ‘ఎక్స్ ట్రా’ ప్రశ్న. అయినా జవాబు ఇచ్చాడు.
“పవన్ కళ్యాణ్ ఒక పెద్ద స్టార్. ఆయనకున్న క్రేజ్, పాపులారిటీ వేరే లెవల్. ఆయనికి నేను సపోర్ట్ చేసి ప్రచారం చెయ్యడం సబబా? ఆయనకున్న క్రేజ్ కి నా లాంటి హీరోల సపోర్ట్ అవసరమా?,” అని సూటిగా సమాధానం ఇచ్చాడు నితిన్.
“జనసేన” పార్టీకి ప్రచారం చేస్తారా అన్న ప్రశ్నకు నితిన్ ఆన్సర్ ఇది. నిజానికి నితిన్ రాజకీయాలకు దూరం. ఆ మధ్య కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నుంచి పిలుపు వస్తే మర్యాదపూర్వకంగా కలిశాడు. అది తప్ప ఎప్పుడూ రాజకీయనాయకులకు, రాజకీయాలకు దూరంగా ఉంటాడు నితిన్. అందరివాడుగా ఉండడమే అతనికి ఇష్టం.
మొత్తానికి పవన్ కళ్యాణ్ “జనసేన” పార్టీకి వేరే హీరోల ప్రచారం అవసరం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్రేజ్, ఆయనకి ప్రజల నుంచి వస్తున్న మద్దతు తీరు చూస్తేంటే వేరే వారి సహాయం అవసరమే పడదు అని ఇన్ డైరెక్ట్ గా నితిన్ చెప్పాడు అనుకోవచ్చు.
నితిన్ నటించిన “ఎక్స్ ట్రా” ఈ నెల 8న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాలో నితిన్ శ్రీలీలతో కలిసి నటించాడు.