నితిన్ తోనే ఆ దర్శకుడు

Nithiin


హీరో నితిన్ కి గతేడాది ఎదురుదెబ్బలు తగిలాయి. ముఖ్యంగా ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా బాగా తేడా కొట్టడంతో నితిన్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళీ తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో చేతులు కలుపుతున్నారు. అలా మళ్ళీ నితిన్ క్యాంప్ లోకి వచ్చారు దర్శకుడు వెంకీ కుడుముల.

మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది అని ఎగిరి గంతేసిన వెంకీ కుడుములకి ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండలేదు. మెగాస్టార్ చిరంజీవి మొదట ఓకె చెప్పారు. సినిమాని ప్రకటించారు. కానీ, ఆ తర్వాత ఫుల్ స్క్రిప్ట్ విని వెనక్కి తగ్గినట్లు సమాచారం. అందుకే, ఆ క్యాంప్ నుంచి ఇప్పుడు నితిన్ క్యాంప్ కి వచ్చారు.

వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు ‘భీష్మ’ వచ్చింది. అది సూపర్ హిట్. ఇప్పుడు మళ్ళీ తనకి అలాంటి హిట్ కావాలనే ఉద్దేశంతో నితిన్ వెంకీ కుడుములని పిలిచారు. చిరంజీవి నో చెప్పిన తర్వాత ఎవరు పిలుస్తారు అని చూస్తున్న వెంకీ కుడుములకి నితిన్ నుంచి పిలుపు రావడం వేయకపోయిన తీగ కాలికి తగిలినట్లైంది.

ఈ సినిమాని మైత్రి సంస్థ నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమా మొదలుకానుంది. ప్రస్తుతం నితిన్ దర్శకుడు వక్కంతం వంశీ తీస్తున్న సినిమాలో నటిస్తున్నారు.

 

More

Related Stories