- Advertisement -

నితిన్ దూకుడు మీదున్నాడు. గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. లాక్డౌన్ పరిస్థితుల తర్వాత మూడు సినిమాల షూటింగులలో పాల్గొనడం విశేషం. మొన్నే చంద్రశేఖర్ యేలేటి తీస్తున్న “చెక్” సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు. ఆ తర్వాత దుబాయ్ వెళ్లి “రంగ్ దే” సినిమా పాటల చిత్రీకరణ కంప్లీట్ చేశాడు. ఇప్పుడు దుబాయ్ లోనే “అంధధూన్” రీమేక్ షూటింగ్ షురూ చేశాడు.
2021లో ఈ మూడు సినిమాలు విడుదల చెయ్యాలని పట్టుదలగా ఉన్నాడు. అలాగే 201 సమ్మర్ తర్వాత మరో సినిమా కూడా కొత్తగా మొదలు పెడుతాడట. ఈ రేంజులో దూకుడు మీదున్నాడు.
తన గాళ్ ఫ్రెండ్ షాలిని ని పెళ్లి చేసుకున్నాడు. కొత్త పెళ్లికొడుకు సినిమాలు తగ్గిస్తాడేమో అనుకున్నారు. కానీ నితిన్ స్పీడ్ మామూలుగా లేదు.