గ్యాప్ లేకుండా సినిమాలు

Nithin

నితిన్ విజయాలు లేక ఇబ్బంది పడుతున్నాడు. సరయిన హిట్ పడి చాలా కాలమే అయింది. అందుకే కాబోలు హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఎక్కువ సినిమాలు చేస్తే అందులో ఎదో ఒకటి ఆడుతుందని ఆశ పడుతున్నట్లు ఉంది.

నితిన్ ప్రస్తుతం “తమ్ముడు” అనే సినిమాలో నటిస్తున్నాడు. “వకీల్ సాబ్” తీసిన వేణు శ్రీరామ్ ఈ సినిమాకి డైరెక్టర్. లయ ఆయన అక్కగా నటిస్తోంది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు “భీష్మ” దర్శకుడు తీస్తున్న “రాబిన్ హుడ్” చిత్రం కూడా చేస్తున్నాడు నితిన్. ఈ రెండు సినిమాల షూటింగ్ ఏకకాలంలో జరుగుతోంది. ఒక సినిమాకి కొన్ని రోజుల డేట్స్, మరో సినిమాకి ఇంకొన్ని రోజులు డేట్స్ ఇస్తూ రెండింటిని సెట్స్ పై ఉంచాడు.

తాజాగా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడట. “మనం” సినిమాతో చాలా పేరుతెచ్చుకున్న విక్రమ్ కుమార్ ఇంతకుముందు నితిన్ తో “ఇష్క్” అనే సినిమా తీశారు. ఇప్పుడు మరో వెరైటీ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నాడు నితిన్. గ్యాప్ తీసుకోవడం లేదు.

Advertisement
 

More

Related Stories