ఇలా అయితే ఎలా నితిన్?

Nithin

నితిన్ యువ హీరోనే. కానీ చాలా సీనియర్. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమా హీరోగా ఉన్నాడు. రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, త్రివిక్రమ్ నుంచి వెంకీ కుడుముల వరకు అందరి దర్శకులతో వర్క్ చేశాడు. కానీ, ఇప్పటికీ కన్సిస్టెంట్ గా హిట్స్ ఇవ్వలేకపోతున్నాడు.

‘ఇష్క్’, ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ సినిమాలతో అతని మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు. రీసెంట్ గా త్రివిక్రమ్ తీసిన ‘అ ఆ’ పెద్ద మలుపు అతని కెరియర్లో. అంత పెద్ద హిట్ వచ్చినా అదే ఊపుని కంటిన్యూ చెయ్యలేదు. గతేడాది ‘భీష్మ’ సినిమాతో మరోసారి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడైనా గ్యాప్ లేకుండా విజయాలు అందిస్తాడనుకుంటే… ‘చెక్’ సినిమాతో సేమ్ స్టోరీ రిపీట్ అయింది.

గత వీకెండ్ విడుదలైన ‘చెక్’ మూడు రోజుల్లో ఏడున్నర కోట్ల రూపాయలు అందుకొంది. ఇకపై మరో రెండు కోట్ల కంటే రాబట్టలేదు ఈ మూవీ. దాదాపు 18 కోట్లకు వ్యాపారం జరిగింది. అంటే ఎనిమిది కోట్ల వరకు థియేటర్లో లాస్. ఇది పెద్ద ఫ్లాప్.

నితిన్ ఇప్పటికైనా కెరీర్ ని సరిగా ప్లాన్ చేసుకోవాలి. హిట్స్ ఇవ్వడం కన్నా… కనిసిస్టెన్సీ మైంటైన్ చెయ్యాలి.

More

Related Stories