నితిన్ ‘మాస్’ని మర్చిపోవాలి!

Nithiin


హీరో నితిన్ ఇప్పటికే ఎన్నో సార్లు యాక్షన్ చిత్రాలు చేశారు. ఫలితం దక్కలేదు. ‘అఆ’, ‘ఇష్క్’, ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ వంటి భారీ విజయాలతో నితిన్ కి సంతృప్తి లేదు. యాక్షన్ హీరోగా, మాస్ హీరోగా నిలబడాలనేది లక్ష్యం.

నితిన్ కిప్పుడు 39 ఏళ్ళు. ఇంకా ఎక్కువకాలం ‘యూత్’ హీరోగా, రొమాంటిక్ హీరోగా కొనసాగలేనని నితిన్ కి తెలుసు. అందుకే, ‘మాస్’ సినిమాలతో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ ఇమేజ్ వస్తే కెరీర్ సేఫ్. కానీ, ప్రేక్షకులు మాత్రం నితిన్ ని అలా చూసేందుకు ఇష్టపడడం లేదు. తాజాగా వచ్చిన ‘మాచర్ల నియోజకవర్గం’తో మరోసారి రుజువు అయ్యింది.

‘మాచర్ల నియోజకవర్గం’ గత వారం విడుదలైంది. నేటితో మొదటి వారం పూర్తి. ఈ సినిమా మొదటి వీకెండ్ కే బకెట్ తన్నేసింది. ఇక రెండో వారం దాక సినిమాని థియేటర్లలో ఉంచడం లేదు. మొదటి వారం ఈ సినిమా 10 కోట్ల కలెక్షను కూడా రాబట్టలేదు.

దీన్ని బట్టి నితిన్ మరికొంతకాలం అయినా ‘మాస్’మాట మర్చిపోవాలి. ఫ్యామిలీ, రొమాన్స్, కామెడీ ఎలిమెంట్స్ తో కూడిన చిత్రాలు చెయ్యాలి.

 

More

Related Stories