పవన్ తో నితిన్ మల్టీస్టారర్!

నితిన్ ….పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ప్రతి సినిమాలో పవర్ స్టార్ ప్రస్తావన ఏదోవిధంగా ఉంటుంది. ఈ వీకెండ్ విడుదలయ్యే ‘చెక్’లో మాత్రం పవన్ కళ్యాణ్ గురించి మాట ఎక్కడా ఉండదట. ‘చెక్’ విడుదల నేపథ్యంలో మీడియాతో నితిన్ ముచ్చట్లు….

చెక్ గురించి…
‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత మూడు ఫ్లాపులు రావడంతో ఓ కమర్షియల్‌ సినిమా, మరో డిఫరెంట్‌ సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యా. డిఫరెంట్‌ సినిమాలు తీయడంలో చంద్రశేఖర్‌ యేలేటి మాస్టర్‌ కాబట్టి ‘చెక్‌’ ఒప్పుకొన్నా. ఆదిత్య జీవిత ప్రయాణమే ‘చెక్‌’. అతను జైలులో ఉండే ఓ ఖైదీ. చెస్‌ నేర్చుకుని ఎలా గ్రాండ్‌ మాస్టర్‌ అయ్యాడనేది సినిమా. నాకు క్లైమాక్స్‌ నచ్చింది. లాస్ట్‌ 15 మినిట్స్‌ హైలైట్‌. కథలో ఎక్కువ శాతం జైలులో జరుగుతుంది. సాంగ్స్‌ లేవు. రొమాంటిక్‌, కామెడీ ట్రాక్స్‌ లేవు.

ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో మీ గురించి రాజమౌళి గొప్పగా చెప్పారు…
అదొక గొప్ప ఫీలింగ్. రాజమౌళి లాంటి గ్రేట్ డైరెక్టర్ నుంచి కాంప్లిమెంట్స్‌ రావడం గ్రేట్‌.

ఇలాంటి కథ చేయడం రిస్క్‌ అనిపించలేదా?
రెండేళ్ల క్రితం అయితే రిస్క్‌ ఏమో! ఇప్పుడు ఆడియన్స్‌ డిఫరెంట్‌ సినిమాలు, ఓటీటీలో కొత్త కంటెంట్‌ చూస్తున్నారు. ‘నాంది’, ‘ఉప్పెన’ ఆడాయి. ఇటువంటి సినిమాలకు ప్రేక్షకులున్నారు.

పెళ్లి తర్వాత విడుదలవుతున్న సినిమా ఇదే. మీ వైఫ్‌ ఎంత ఎగ్జైటెడ్‌గా ఉన్నారు?
నాకు ఎగ్జైట్‌మెంట్‌ ఏమీ లేదు. సినిమా ఆడితే భార్య వచ్చిన వేళావిశేషం అంటారు. ఆడకపోతే ఆమె బ్యాడ్‌లక్‌ అంటారు. అందుకని, తనకు కొంచెం టెన్షన్‌ ఉంది. నా వరకు అలాంటి ఫీలింగ్స్ లేవు.

మ్యారీడ్‌ లైఫ్‌ ఎలా ఉంది?
పెద్ద తేడా ఏమీ లేదు. పెళ్లికి ముందు షాలిని ఇంటికి వచ్చి వెళ్తుండేది. పెళ్లి తర్వాత ఎప్పట్నుంచో తను ఇంట్లో ఉన్న ఫీలింగ్‌. ఇంట్లో మెంబర్‌లా ఉంది తప్ప నాకు కొత్తగా ఏమీ లేదు.

వాళ్ళది డాక్టర్స్‌ ఫ్యామిలీ, మీది యాక్టర్స్‌ ఫ్యామిలీ…
యాక్టర్‌ అండ్‌ డాక్టర్‌… బాగా సింక్‌ అయ్యింది. నాకు ఏదైనా అనారోగ్యం వస్తే, ఇంతకు ముందు డాక్టర్‌ దగ్గరకు వెళ్ళేవాడ్ని. ఇప్పుడు అత్తమామలకు ఫోన్‌ చేసి అడగొచ్చు.

మల్టీస్టారర్‌ ఫిల్మ్స్‌ చేసే ఇంట్రెస్ట్‌ ఉందా?
ఉంది. అవకాశం వస్తే… నా ఫస్ట్‌ ఛాయిస్‌ పవన్‌కల్యాణ్‌గారే. ఆ ఛాన్స్‌ ఎప్పుడు వస్తుందా? అని వెయిట్‌ చేస్తున్నా.

మీ నెక్ట్స్‌ సినిమాలు?
‘రంగ్‌ దే’ చిత్రీకరణ పూర్తి చేశా. ‘అంధాధున్‌’ రీమేక్‌ షూటింగ్‌ సగం అయ్యింది. ఈ రెండు సినిమాల రిలీజ్‌ డేట్స్‌ అనౌన్స్‌ చేశాం. మేలో ‘పవర్‌ పేట’ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తా. కుదిరితే ఆ సినిమా డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. మరి కొన్ని సినిమాలు యాక్సెప్ట్‌ చేశా. ఇవిరిలీజ్‌ అయ్యాక వాటి గురించి చెబుతా.

More

Related Stories