ఆ హీరోయిన్ల వెంట పడుతున్న నితిన్!

- Advertisement -
Nithin

నితిన్ ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు విడుదల చేశాడు. మూడోది (‘మ్యాస్ట్రో) త్వరలోనే ఓటిటి వేదికపైకి రానుంది. అలాగే, ఈ ఏడాది ఇంకో రెండు సినిమాలు లాంచ్ చేస్తాడట.

నితిన్ త్వరలో ప్రారంభించే సినిమాలకు హీరోయిన్లని ఫిక్స్ చేసే కార్యక్రమం మొదలైంది. రీసెంట్ గా పాపులర్ హీరోయిన్లతో జతకడుతున్నాడు నితిన్. ‘రంగ్ దే’లో కీర్తి సురేష్, ‘చెక్’లో రకుల్ ప్రీత్ సింగ్, ‘బీష్మ’లో రష్మిక మందాన నటించారు.

ఇక దర్శకుడు వక్కంతం వంశీ డైరెక్ట్ చేసే కొత్త సినిమాలో పూజ హెగ్డేని తీసుకురావాలని నిర్మాత ఠాగూర్ మధు ప్రయత్నిస్తున్నారట. ఐతే, ఇప్పటివరకు పూజకి కథ చెప్పలేదు, ఆమె ఓకే అనలేదు. కేవలం అది మేకర్స్ ఆలోచన మాత్రమే. ఒకవేళ ఆమె ఒప్పుకుంటే సినిమాకి క్రేజ్ వస్తుంది.

మొత్తమ్మీద, యువతలో క్రేజున్న హీరోయిన్లతో జతకట్టేందుకు నితిన్ ఆసక్తి చూపుతున్నాడన్నమాట.

 

More

Related Stories