5 నెలల్లో 3 సినిమాలు

Nithiin

గత ఏడాది మూడు సినిమాలు విడుదల చెయ్యాలనుకున్నాడు నితిన్. కానీ ‘భీష్మ’ విడుదల కాగానే లాక్డౌన్ పడింది. దాంతో, గతేడాది విడుదల కావాల్సిన ‘రంగ్ దే’, ‘చెక్’ చిత్రాలతో పాటు రీసెంట్ గా మొదలుపెట్టిన ‘అంధధూన్’ రీమేక్ ని కూడా ఈ ఏడాది ప్రతిమార్థంలోనే తీసుకొస్తున్నాడు.

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తీసిన ‘చెక్’ వచ్చేవారం థియేటర్లలోకి వస్తోంది. వచ్చే నెలలో ‘రంగ్ దే’ రిలీజ్ అవుతుంది. రెండు నెలల గ్యాప్ తర్వాత జూన్ లో ‘అంధధూన్’ రీమేక్ థియేటర్లలోకి రానుంది. ఈ మూడు సినిమాలు విడుదల కాగానే, ‘పవర్ పేట’ అనే మూవీ షూటింగ్ తో బిజీ అయిపోతాడు. కృష్ణ చైతన్య తీసే ఈ మూవీ రెండు పార్టులుగా విడుదల కానుంది. ఆ తర్వాత కొత్త సినిమాలు ఒప్పుకుంటాడట.

నితిన్ ఇప్పుడు ఏడాదికి రెండు, మూడు సినిమాలు రిలీజ్ చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నాడు.

More

Related Stories