టీవీలో ‘రంగ్ దే’ కన్నా చెక్ బెటర్!

Check


నితిన్ సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఘోరంగా ఫ్లాప్ అయిన చిత్రం “చెక్”. చంద్రశేఖర్ యేలేటి తీసిన ఈ మూవీ రెండో రోజుకే దుకాణం సర్దేసింది. మొదటి వీకెండ్ తర్వాత చాలా థియేటర్ల నుంచి లేపేశారు. క్రిటిక్స్ చీల్చి చెండాడారు.

ఐతే, జెమినీ టీవీలో గత వారం ప్రీమియర్ గా ప్రసారం అయింది. టీవీ జనం మాత్రం కొంచెం బెటర్ సంఖ్యలోనే చూసినట్లున్నారు. ఈ సినిమాకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పట్టణ ప్రాంతాల్లో 8.53 రేటింగ్ వచ్చింది. నితిన్ సినిమాలకు కిది మంచి రేటింగ్. మొన్న జీటీవోలో ప్రసారం అయిన ‘రంగ్ దే’ కన్నా ఎక్కువ వచ్చింది. ‘రంగ్ దే’ సినిమాకి 7.22 వస్తే దీనికి ఏకంగా 8.53 వచ్చింది. అంటే థియేటర్లో కాస్త బెటర్ గా ఆడిన ‘రంగ్ దే’ టీవీలో కుదేల్ అయింది.

థియేటర్లో దారుణంగా పరాజయం పొందిన ‘చెక్’ టీవీల్లో మాత్రం కాస్త బెటర్ అనిపించుకొంది.

కాకపొతే, నితిన్ రెండూ మర్చిపోవాల్సిన చిత్రాలే. అతని మార్కెట్ ని తగ్గించిన సినిమాలు ఇవి.

 

More

Related Stories