నిత్యామీనన్ కొత్త మేకోవర్

Nithya Menen

రెగ్యులర్ హీరోయిన్లు పెట్టేలా తన అందానికి సంబంధించి ఫొటోలు పెద్దగా పోస్ట్ చేయదు నిత్యామీనన్. ఆమె గురించి ఆమె సినిమాలే మాట్లాడతాయి. గ్లామర్, మేకోవర్, న్యూ లుక్ లాంటి పదాలకు నిత్య కొంచెం దూరంగానే ఉంటుంది. అలాంటి అమ్మాయి నుంచి ఓ గ్లామరస్ పిక్ వస్తే ఎలా ఉంటుంది..

న్యూ హెయిర్ కట్ తో నిన్న ఓ ఫొటో పోస్ట్ చేసింది నిత్యామీనన్. తన కొత్త హెయిర్ స్టయిల్ ఎలా ఉందంటూ నెటిజన్ల అభిప్రాయం కూడా కోరింది. నిత్యామీనన్ కొత్త లుక్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె న్యూ లుక్ అదిరిపోయిందంటూ వరుసగా కామెంట్స్ పెడుతున్నారు. 

Also Check: Nithya Menen Latest Photos

నిత్యామీనన్ తన జుట్టును మరింత తగ్గించి, షార్ట్ హెయిర్ కట్ లోకి మారింది. గోల్డెన్ కలర్ డై కూడా అప్లై చేసింది. నిజంగానే ఆమెకు అది బాగా సూట్ అయింది. అయితే ఉన్నఫలంగా నిత్యా ఎందుకిలా కొత్తగా ట్రై చేసిందనే అనుమానం అందర్లో ఉంది. ఆ డౌట్స్ క్లియర్ చేస్తూ, కొద్దిసేపటి కిందట ఆమె తను నటించిన ఓ కొత్త యాడ్ పోస్ట్ చేసింది. అందులో నిత్యామీనన్ షార్ట్ హెయిర్ కట్ తో కలిపించింది.

ఈ యాడ్ కు టీజర్ గా ఆ ఫొటోలు రిలీజ్ చేసిందనుకోవాలి

Related Stories