
నిత్య మీనన్ కేరళ కుట్టి. మాతృభాష మలయాళమే కానీ తెలుగులో తనే డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తోంది చాలా కాలంగా. తెలుగు బాగా మాట్లాడుతుంది. ఐతే, తెలుగు ఎంత బాగా వచ్చినా యాసలో డైలాగులు చెప్పడం అంత సులువు కాదు. త్వరలో విడుదల కానున్న ‘స్కైలాబ్’ సినిమాలో ఆమె తెలంగాణ యాసలోనే మొత్తం డైలాగులు చెప్పడం విశేషం.
సత్యదేవ్, నిత్య మీనన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ మూవీ వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ సినిమాకి ఆమె సహ నిర్మాత కూడా.
“తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో జరిగే కథ. బండలింగం పల్లి అనే విలేజ్‌లో జరుగుతుంది సబ్జెక్ట్. పీరియడ్ మూవీ కానీ కలర్ ఫుల్ గా ఉంటుంది,” అని చెప్తోంది నిత్య.
“అవును తెలంగాణ యాసలో మాట్లాడా. అదీ సింక్ సౌండ్‌లో చేశా. అంటే… డబ్బింగ్ లో కాదు. సెట్ లోనే డైలాగులు చెప్పా. ఒక్క వర్డ్ కూడా తప్పు చెప్పలేదన్నారు. యాస కోసం శిక్షణ ఏమి తీసుకోలేదు కానీ ఎక్కువగా తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడే వారి దగ్గర కూర్చొని వారి మాటలు వింటూ నేర్చుకున్నా. నాకు తెలంగాణ యాక్సెంట్ పై చాలా ఇష్టం ఏర్పడిందిప్పుడు. తెలంగాణ విలేజెస్ చాలా బ్యూటీఫుల్‌గా ఉంటాయి. సినిమా సెట్ తో పాటు హైదరాబాద్ పరిసరాల్లోనే మొత్తం షూటింగ్ పూర్తి చేశాం,” అని అంటోంది నిత్య మీనన్.
పవన్ కళ్యాణ్ సరసన కూడా ఆమె ‘భీమ్లా నాయక్’లో నటించింది.