
నివేదా పేతురాజ్ కూడా ఓటిటిలోకి అడుగుపెడుతోంది. ఈ అందాల భామ మెయిన్ హీరోయిన్ గా వెబ్ మూవీ రూపొందింది. ఈ వెబ్ ఒరిజినల్ కి ‘బ్లడీ మేరి’ అనే పేరు ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ విడుదలైంది.
“ఆహా”లో విడుదల కానుంది. “ఆహా” తెలుగు హీరోలు, హీరోయిన్లతో ఒరిజినల్ సినిమాలు, సిరీస్ లు, టాక్ షోలు నిర్మిస్తూ బాగా పాపులర్ అయింది.
“కార్తికేయ”, “ప్రేమమ్” వంటి సినిమాలు తీసిన దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన తొలి డిజిటల్ మూవీ.
‘ఇఫ్ యువార్ బ్యాడ్, షి ఈజ్ బ్లడీ బ్యాడ్’ అనేది దీని ట్యాగ్ లైన్. వైకల్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ తన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనగలిగే అమ్మాయిగా ఇందులో నివేదా నటించారట.
కిరిటీ దామరాజు, రాజ్ కుమార్ కసిరెడ్డి, బ్రహ్మాజీ, అజయ్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.