
అమ్మ మెస్ పేరిట చాలా హోటళ్లు ఉంటాయి. కానీ మధురైలో ఉన్న అమ్మ మెస్ అంటే తనకు చాలా ఇష్టం అంటోంది హీరోయిన్ నివేథ పెతురాజ్. నిజంగా అక్కడ వంటకాలు చాలా రుచిగా ఉంటాయంటోంది. ఇంట్లో కాస్త ఫ్రీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. నెటిజన్లతో చిట్ చాట్ చేసింది.
– లాక్ డౌన్ టైమ్ లో ఏది బోర్ అనిపించింది?
ఈ ప్రపంచంలో నాకు ఏదీ బోర్ కొట్టదు.
– ఇష్టమైన కారు?
ది డాడ్జ్ డెమాన్
– మంచి బిజినెస్ ఐడియా చెప్పండి?
కస్టమర్లు ఆన్ లైన్ లో తమకు నచ్చిన చీరలపై, నచ్చిన డిజైన్ ను వాళ్లే సెలక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే బాగుంటుంది కదా.
– ఇష్టమైన ప్రదేశం?
హవాయ్ దీవులు, మధురై అంటే నాకిష్టం
– ఈ లాక్ డౌన్ లో ఇష్టమైన ఫుడ్ ఏది?
ఈ లాక్ డౌన్ టైమ్ లో మసాలా ఉండలు చేశాను. వైట్ సాస్ పాస్తా కూడా ఇష్టం.
– టైమ్ మెషీన్ లో వెనక్కి వెళ్తే ఏం చూడాలనుకుంటారు?
మనిషి పుట్టుకకు మూలమైన బిగ్ బ్యాంగ్ ను చూడాలనుకుంటున్నాను.
– డైట్ అండ్ వెయిట్ సీక్రెట్?
మినిమం గ్యాప్స్ లో ఫాస్టింగ్. దీంతో పాటు ప్రతి రోజూ కార్డియో.
– ప్రస్తుతం చూస్తున్న వెబ్ సిరీస్..
ఇంప్రాక్టికల్ జోక్స్.
– మీ పేరుకు అర్థం ఏంటి?
నా పేరు సందేశం అని అర్థం. ఇక అరబిక్ భాషలో సౌందర్య దేవత అని అర్థం
– ఏడాది కిందటికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్?
సరిగ్గా ఏడాది కిందటి పరిస్థితికి, ఈరోజు నా పరిస్థితికి చాలా తేడా ఉంది. ఎప్పటికప్పుడు క్రోడీకరించుకుంటూ.. అవగాహనతో బతకడమే బెస్ట్.
– మిమ్మల్ని సంతోషంగా ఉంచేది ఏంటి?
ప్రేమ.
– మధురైలో మీకు ఇష్టమైన రెస్టారెంట్?
అమ్మా మెస్.. దానిపక్కనే ఉన్న కోలా షాప్.