హీరోయిన్ నివేత పేతురాజుకి నటన కన్నా స్పోర్ట్స్, ట్రావెలింగ్ అంటే ఎక్కువ ఇష్టం. ఆమె ఇప్పటికే ఫార్ములా వన్ రేస్ లో తర్ఫీదు పొందింది. ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆటలో ఛాంపియన్ గా నిలిచింది.
నివేత తమిళనాడుకి చెందిన ముద్దుగుమ్మ. ఆమె తన స్వంత రాష్ట్రంలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంది. మిక్స్డ్ డబుల్స్ ఆడి విజేతగా నిలిచింది. కప్పును ముద్దాడుతున్న ఫోటోలను షేర్ చేసింది. సాధారణంగా హీరోయిన్లు క్లాసికల్ డ్యాన్స్ పోటీలు, వంటల పోటీలు, అందాల పోటీల్లో పాల్గొంటారు. కనై ఈ భామ మాత్రం వేరు.
నివేత హీరోయిన్ గా అడుగుపెట్టిన కొన్నాళ్లకే కారు రేసింగ్ లో శిక్షణ తీసుకొని సర్టిఫికెట్ పొందింది. ఇండియాలో ఫార్ములా కారు రేసింగ్ చెయ్యగలిగే అతికొద్దిమంది అతివల్లో ఈ భామ ఒకరు.
ప్రస్తుతం సినిమాలు పెద్దగా చెయ్యడం లేదు భామ. ఎక్కువగా ఆటలు, విహార యాత్రల్లో పాల్గొంటోంది.