కాబోయే భర్త ఇలా ఉండాలంట

Nivetha Thomas

తమకు కాబోయే భర్త ఎలా ఉండాలనే అంశంపై హీరోయిన్లందరికీ ఓ స్పష్టత ఉంది. కాబోయే భర్త పొడుగ్గా ఉండాలని, మంచి మనసు కలిగి ఉండాలని, నిజాయితీగా ఉండాలని ఇప్పటికే చాలామంది హీరోయిన్లు తమ మనసులో మాట బయటపెట్టారు. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరోయిన్ నివేత థామస్ కూడా చేరింది. తనకు కాబోయే భర్తకు ప్రత్యేకంగా ఉండాల్సిన ఓ లక్షణాన్ని బయటపెట్టింది.

నివేత థామస్ కు కాబోయే భర్త కచ్చితంగా ప్రయాణాల్ని ఇష్టపడేవాడై ఉండాలంట. ఎందుకంటే నివేత థామస్ కు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అంట. కాబట్టి తనకు కాబోయే భర్తకు కూడా ట్రావెలింగ్ ఇష్టం ఉంటే.. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి ఎంచక్కా టూర్స్ వేయొచ్చనేది నివేత ఆలోచన.

ఈ ప్రత్యేకమైన లక్షణంతో పాటు.. మిగతా హీరోయిన్లంతా చెప్పినట్టే నివేతకు కాబోయే వాడు పొడుగ్గా, నిజాయితీగా ఉండాలంట.

ఇన్ని చెప్పిన ఈ భామ, పెళ్లిపై మాత్రం చాలా రొటీన్ గా, బోరింగ్ గా రియాక్ట్ అయింది. పెళ్లి చేసుకునే టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా చేసుకుంటుందట. ప్రస్తుతం ప్రేమించడానికి టైమ్ లేదంట. ఇవన్నీ రొటీన్ ఆన్సర్లే కదా.

Related Stories