దీనికే అంత బిల్డప్పా!

Nivetha Thomas

నివేథా థామస్.. ఈ హీరోయిన్ కంటూ సెపరేట్ గా ఓ ఇమేజ్ ఉంది. తను చేసే పాత్ర ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్నాళ్లూ అదే పద్ధతి ఫాలో అయింది కూడా. సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చు కానీ, క్యారెక్టర్ల పరంగా నివేథా ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. కానీ ఫస్ట్ టైమ్ నివేత ఛాయిస్ పై విమర్శలు పడుతున్నాయి. అదే ‘వి’ సినిమా. దానికి ఓ రీజన్ ఉంది. రిలీజ్ కు ముందు మీడియాకిచ్చిన ఇంటర్వ్యూల్లో తన పాత్ర గురించి ఓ రేంజ్ లో చెప్పింది. అదేదో ఉదాత్తమైన పాత్ర అన్న బిల్డప్పు ఇచ్చింది. తీరా చూస్తే కూరలో కరివేపాకు పాత్ర.

నాని-సుధీర్ బాబు నటించిన ఈ మల్టీస్టారర్ మూవీలో అపూర్వ అనే నవలా రచయిత పాత్ర పోషించింది నివేత. కథానుసారం ఒకట్రెండు చోట్ల సూపర్ కాప్ హీరోకు సహాయం చేసేలా అపూర్వ పాత్ర పనికొచ్చినప్పటికీ.. చాలా సందర్భాల్లో కథ-కథనాలకు ఇదే పాత్ర అడ్డు తగిలిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఆమె రోలుని తీసేస్తే నష్టమే లేదు…. ఇంకా నిడివి తగ్గి బెటర్ అవుద్ది.

ఆమె పాత్ర కంటే నిడివి పరంగా చిన్నదే అయినప్పటికీ అదితి పాత్ర బెటర్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలా తొలిసారిగా తన పాత్రల ఎంపికపై నివేథా థామస్ విమర్శలు ఎదుర్కొంటోంది.

Related Stories