మలయాళ స్టార్ నివిన్ పాలీ హీరోగా నటించిన కొత్త సినిమా మహవీర్యర్. అసిఫ్ అలీ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత ఎం ముకుందన్ రాసిన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మహవీర్యర్ సినిమాను ఇండియన్ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి నివీన్ పాలీ తన సొంత ప్రొడక్షన్ కంపెనీ పాలీ జూనియర్ పిక్చర్స్ పై నిర్మిస్తున్నారు.
ఆదివారం ఈ చిత్ర టీజర్ ను చిత్రబృందం విడుదల చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్, క్వాలిటీలో వరల్డ్ క్లాస్ మేకింగ్ తో ఉన్న టీజర్ ఆకట్టుకుంటోంది.
పీఎస్ షన్మాస్, నివీన్ పాలీ నిర్మాతలు. అబ్రిడ్ షైన్ దర్శకత్వం వహిస్తున్నారు. మహవీర్యర్ సినిమా ఫాంటసీ, టైమ్ ట్రావెల్, న్యాయ సూత్రాల ప్రాధాన్యత వంటి అంశాలు కలిసిన కథతో తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ హీరో బిర్జు సినిమా తర్వాత నివీన్, దర్శకుడు అబ్రిడ్ షైన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మహవీర్యర్ పై అంచనాలు ఉన్నాయి.