‘జవాన్’లో బన్ని లేడు!

షారుక్ ఖాన్ హీరోగా దర్శకుడు అట్లీ తీస్తున్న ‘జవాన్’ సినిమా విడుదల జూన్ నుంచి సెప్టెంబర్ కి వాయిదా పడింది. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల తేదీని మార్చారు. మరోవైపు, ఈ సినిమాలో మన తెలుగు బడా స్టార్ అల్లు అర్జున్ ఒక అతిథి పాత్రలో కనిపిస్తాడని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ, అది అబద్దమని తేలింది.

అల్లు అర్జున్ ‘జవాన్’ సినిమాలో ఏ పాత్ర పోషించడం లేదు అని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. షారుక్ ఖాన్ ఇటీవలే ‘పఠాన్’తో కళ్ళు చెదిరే హిట్ అందుకున్నారు. అన్ని రికార్డులను చెరిపేసింది ‘పఠాన్’. దాంతో, ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు షారుక్ సినిమాలకు యమా క్రేజ్ ఏర్పడింది. ‘జవాన్’పై అంచనాలు మామూలుగా లేవు.

కాబట్టి, ఈ సినిమాలో ఇంకో హీరో గెస్ట్ రోల్ చెయ్యాల్సిన అవసరం లేదు అని ఫిక్స్ అయ్యారట. సో, అల్లు అర్జున్ ఇంతవరకు అప్రోచ్ కాలేదట. ఇక అయ్యే అవకాశం కూడా లేదు అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఐతే, ‘జవాన్’ చిత్రంలో దక్షిణాది టాలెంట్ ఎక్కువగా ఉంది. ఈ సినిమా దర్శకుడు అట్లీ తమిళ్. హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. విలన్ గా విజయ్ సేతుపతి కనిపిస్తారు. ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నది కూడా అనిరుధ్ రవిచందరే. అల్లు అర్జున్ కూడా అతిథి పోషించి ఉంటే మొత్తం సౌత్ డామినేషన్ ఉండేది.

ఐతే, ఇప్పుడు షారుక్ ఖాన్ మళ్ళీ తన ఫామ్ ని అందుకున్నారు కాబట్టి ఆయనకి ఇంకో హీరో సపోర్ట్ అవసరం లేదు. అందుకే, గెస్ట్ రోల్ ఆలోచనని విరమించుకున్నారట.

Advertisement
 

More

Related Stories