7 వరకు కష్టడీలోనే షారుక్ కొడుకు

- Advertisement -


బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కి మరికొన్నాళ్లు మానసిక క్షోభ తప్పేలా లేదు. డ్రగ్స్ కేసులో అరెస్టైన తన కొడుకు ఆర్యన్ ఖాన్ కి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. పేరొందిన లాయర్ వాదించినా ఫలితం లేకపోయింది. ఈ నెల 7 వరకు తమకు కస్టడీకి ఇవ్వాలని నార్కోటిక్ కంట్రోల్ బోర్డు కోరడంతో కోర్టు అంగీకరించింది.

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కొన్నట్లు, తీసుకున్నట్లు ఆధారాలు లేవు. అలాంటిది డ్రగ్స్ అమ్మాడని ఎన్సీబీ చెప్పడం హాస్యాస్పదం అంటూ ఆర్యన్ లాయర్ సతీష్ మాన్సిందే కోర్టులో వాదించారు. ఆర్యన్ తన స్నేహితులు పిలిచారని షిప్ ఎక్కారు. కానీ అతను డ్రగ్స్ అమ్ముతున్నాడు అనడం నిరాధారం. కావాలంటే ఆ షిప్ నే కొనగలడు… డ్రగ్స్ ఎందుకు అమ్ముతాడు? అని లాయర్ వాదించారు. కానీ, కోర్టు ఎన్సీబీ వాదనకి సమ్మతిస్తూ మరో మూడు రోజులు విచారించేందుకు అనుమతి ఇచ్చింది.

షారుక్ కొడుకు అతని స్నేహితులు నలుగురు ఈ నెల 7వరకు కస్టడీలో ఉంటారు. క్రూజ్ షిప్ లో Rave పార్టీ కోసం ఆర్యన్ వెళ్ళినప్పుడు ఎన్సీబీ అధికారులు రైడ్ చేశారు.

వేల కోట్ల ఆస్తి ఉన్న ఆర్యన్ ఖాన్ కి 23 ఏళ్ళు. త్వరలోనే హీరోగా అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నాడు. షారుక్ కెరియర్ కొన్నాళ్లుగా ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. కానీ, కొడుకు ఈ కేసులో పట్టుబడడం షారుక్ కి పెద్ద షాక్. దానికన్నా, కొడుకుని విడిపించుకోలేని నిస్సాయహతలో ఉన్నారు షారుక్ ఇప్పుడు.

 

More

Related Stories