ఏపీలో బెనిఫిట్ షోలుండవు!

Cinema Theaters

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవు. కేవలం నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలి. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు మాత్రమే టికెట్లు అమ్మాలి.

ఇవన్నీ కొత్త చట్టంలో ఉన్న విధివిధానాలు. ఆంధ్రపదేశ్ సినిమా రెగ్యులేషన్ చట్టానికి సవరణలు తీసుకొస్తూ ఈ రోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక ఈ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఆంధ్రాలో రోజుకు నాలుగు షోలు మాత్రమే అనుమతి ఇస్తారు. పెద్ద సినిమాలు విడుదలైన రోజు రోజుకు ఐదారు షోలు వేసేందుకు అనుమతి ఉండదు.

అంతా చట్టప్రకారమే వెళ్తే బెనిఫిట్ షోలు కూడా ఉండవు. ప్రభుత్వ పోర్టల్ ద్వారా మాత్రమే టికెట్ల అమ్మకం ఉంటుంది. వినోదం అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లతో చర్చించి ఆన్లైన్ టికెట్ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొస్తామని అన్నారు మంత్రి పేర్ని నాని.

రాబోయే పెద్ద సినిమాలకు ఇది పెద్ద దెబ్బ. ఐతే, ఎవరికీ బెనిఫిట్ చేస్తున్నారో చూపించి వేసుకోవచ్చు అన్నట్లుగా ఒక కిటుకు కూడా మంత్రిగారే సెలవిచ్చారు. ఇన్ డైరెక్ట్ గా సినిమా వాళ్ళు అందరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే అన్ని సాఫీగా జరుగుతాయి. చట్టం అమల్లోకి వచ్చినా ప్రభుత్వం అస్మదీయుల సినిమాలను చూసీ చూడనట్లు వదిలేస్తుంది. తస్మదీయులను చట్టం పేరుతో ఇరుకున పెట్టొచ్చు.

Advertisement
 

More

Related Stories