పోటీలేని సాయి ధరమ్ తేజ్

Virupaksha

సాయి ధరమ్ తేజ్ కి టైం కలిసి వస్తోంది. సాయి ధరమ్ తేజ్ నటించిన కొత్త చిత్రం… విరూపాక్ష. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. నిజానికి ఈ సినిమాపై హైప్ లేదు. ట్రైలర్ ఆసక్తి రేపింది. కానీ, భారీ అంచనాలు మాత్రం లేవు. ఇలాంటి టైంలో ఈ సినిమాకి ఇతర అంశాలు కలిసి రావడం విశేషం.

ఈ వీకెండ్ ఈ సినిమాకి పోటీ ఇచ్చే సినిమా లేదు. గతవారం విడుదలైన ‘శాకుంతలం’ చాప చుట్టేసింది. అంతకుముందు వారం విడుదలైన ‘రావణాసుర’ కూడా ఫ్లాప్ అయింది. ‘దసరా’ సినిమా రన్ కూడా ముగిసింది. పైగా, అసలైన సమ్మర్ సెలవులు ఇప్పుడే మొదలయ్యాయి. పిల్లల పరీక్షలు పూర్తి అయ్యాయి.

సో, ఈ సినిమాకి టాక్ వస్తే మంచి కలెక్షన్లు వస్తాయి. మొదటి వారం ఎటువంటి పోటీ లేదు ఈ సినిమాకి.

వచ్చే వారం మాత్రం మణిరత్నం తీసిన ‘పొన్నియన్ సెల్వన్ 2’, అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ బరిలో ఉంటాయి. రెండూ పెద్ద చిత్రాలు. రెండింటిపై అంచనాలు ఉన్నాయి. సో, సాయి ధరమ్ తేజ్ ఈ వారం మొత్తం దున్నేసుకోవచ్చు.

Advertisement
 

More

Related Stories