డేటింగ్ కాదు ఓన్లీ కిస్సులు!

హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్, హీరో అల్లు శిరీష్ మధ్య కొంతకాలంగా సంథింగ్ నడుస్తోంది అని ఇటీవల వార్తలు షికార్లు చేశాయి. అవి అబద్దమని ఇద్దరూ ప్రకటించారు. శిరీష్ తాను ఇంతకుముందు డేటింగ్ చేసిన అమ్మాయిల గురించి మాట్లాడాడు. ఈ భామతో అలాంటిదేమి లేదని చెప్పాడు.

ఐతే, వీళ్ళిద్దరూ కలిసి నటించిన ‘ఊర్వశివో రాక్షసీవో’ చిత్రంలో మాత్రం హాట్ హాట్ కెమిస్ట్రీ ఉందని తెలిపాడు.

అన్నట్లు, ఈ సినిమాలో దాదాపు 40 నిమిషాల పాటు పెద్దలకు మాత్రమే అనిపించేలా సీన్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఐతే, అది కూడా నిజం కాదంట. యూత్ ఫుల్ సన్నివేశాలు ఉన్నాయి కానీ ‘పెద్దలకు మాత్రం’ అనే రేంజులో శృంగార సన్నివేశాలు లేవంట. ముద్దు సీన్లు మాత్రం బోలెడు.

వీరి మధ్య తీసిన కిస్ సీన్లను చూసిన వాళ్ళు వీరు నిజజీవితంలో కూడా లవర్స్ అనుకుంటారట.

 

More

Related Stories