ఆ చాట్ లో ఏమి లేదు: హైకోర్టు

Aryan Khan


షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కి మరో ఊరటదక్కింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఇటీవల బెయిల్ దక్కింది. తాజగా బాంబే హైకోర్టు విడుదల చేసిన బెయిల్ ఆర్డర్ లో ఆర్యన్ ఖాన్ చాట్ గురించి కొన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

ఆర్యన్ ఖాన్ ని అరెస్ట్ చేసిన కేసులో నార్కోటిక్ కాంట్రొల్ బోర్డు (ఎన్సీబీ) అతని మొబైల్ లోని వాట్సాప్ చాట్ పైనే ఆధారపడింది. అంతర్జాయతీయ డ్రగ్స్ డీలర్స్ తో ఆర్యన్ ఖాన్ కి సంబంధాలున్నట్లు వాట్సాప్ చాట్ లో ఆధారాలు ఉన్నాయని ఎన్సీబీ ఇప్పటివరకు వాదిస్తూ వచ్చింది. ఆర్యన్ ఖాన్, హీరోయిన్ అనన్య పాండే కూడా ఈ విషయంలో చాటింగ్ చేసుకున్నారని చెప్పింది ఎన్సీబీ. అంతేకాదు, ఈ విషయంలో అనన్య పాండేని కూడా ఇంటరాగేట్ చేసింది.

ఐతే, తాజాగా బెయిల్ ఆర్డర్ లో బాంబే హైకోర్టు చెప్పిన విషయాలు చూస్తే ఎన్సీబీ వాదనలో మొత్తం డొల్లతనమే. “వాట్సాప్ చాట్స్ లో అభ్యంతరకరమైనది ఏది లేదు. డ్రగ్స్ కి సంబందించిన చాటింగ్ అని చెప్పడానికి వాటిలో ఆధారమే లేదు,” అని కోర్టు తెలిపింది.

అంతేకాదు, ఇంటరాగేషన్ లో భయపెట్టి చెప్పించే మాటలను పట్టించుకోమని కూడా కోర్టు పేర్కొంది. అంటే, ఈ మొత్తం కేసు రాజకీయ కక్ష సాదింపు అని అర్థమవుతోంది. షారుక్ ఖాన్ ఇరుకున పెట్టేందుకు కొందరు ఆడిన గేమ్ ఇది అని వినిపిస్తున్న వాదన నిజం అనేలా పరిణామాలు ఉన్నాయి.

Advertisement
 

More

Related Stories