బాలయ్య వర్సెస్ చిరు పోటీ లేనట్లే!

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ.. బాక్సాఫీస్ బరిలో పోటీపడుతారని చాలా మంది భావించారు. ‘గాడ్ ఫాదర్’, ‘జై బాలయ్య’ చిత్రాలు దసరాకి పోటీ పడుతాయి అనుకున్నారు. కానీ బాలయ్య సినిమా దసరా పోటీ నుంచి తప్పుకొంది.

చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది. బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డిసెంబర్ లో కానీ, సంక్రాంతికి కానీ విడుదల అవుతుంది. మరి, సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న మరో సినిమా రానుంది. అప్పుడు బాలయ్య, చిరంజీవి మధ్య పోటీ ఉంటుందా?

బాలయ్య సినిమాని సంక్రాంతికి కాకుండా డిసెంబర్ లోనే విడుదల చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు. చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాని నిర్మిస్తున్నది, బాలయ్య మూవీని నిర్మిస్తున్నది ఒకే సంస్థ. అదే మైత్రి మూవీ మేకర్స్. ఒకే సంస్థ తమ రెండు సినిమాల మధ్య పోటీ పెట్టుకోదు కదా.

అలా, చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ అటు దసరాకు, ఇటు సంక్రాంతికి ఉండబోవడం లేదు.

 

More

Related Stories