మారుతికి హీరో దొరకట్లేదా?

Maruthi

అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నాని … ఇలా పెద్ద ఆప్సన్ లు పెట్టుకున్నాడు మారుతి. కానీ ఏది ఇప్పట్లో వర్కవుట్ కావట్లేదు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో విడుదలైన “ప్రతి రోజు పండగే” మంచి హిట్టయింది. కానీ, హీరోల డేట్స్ పొందడం ఎంత కష్టమో తెలిసింది మారుతికి. నాని, మారుతితో మరోసారి టీంఅప్ అయ్యేందుకు ఆసక్తి చూపాడు కానీ దానికి మరో ఏడాది టైం పడుతుంది. నాని “టక్ జగదీష్”, “శ్యామ సింగ రాయ” సినిమాలను పూర్తి చెయ్యాలి.

బన్నీ …మారుతికి స్నేహితుడే కానీ సినిమా ఇవ్వలేదు ఇప్పట్లో. విజయ్ దేవరకొండ కూడా బిజీ.

మళ్ళీ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి హీరోల చుట్టే తిరగాలి. అందుకే .. ఏ మూవీని అనౌన్స్ చెయ్యడం లేదు. వంశీ పైడిపల్లి వంటి పెద్ద డైరెక్టర్ పరిస్థితి కూడా అదే. పెద్ద హీరోలతోనే సినిమాలు చేస్తాం అని కూర్చునే ఈ దర్శకుడికైనా ఇదే సిట్యుయేషన్.

Related Stories