నయనతారతో గొడవ లేదు!

టాప్ హీరోయిన్ నయనతారతో గొడవ లేదని క్లారిటీ ఇచ్చింది మాళవిక మోహనన్. ఆమె పెద్ద సూపర్ స్టార్ ఆమెతో నాకు ఎందుకు గొడవలు ఉంటాయి అని ప్రశ్నిస్తోంది ఈ సుందరి. మీడియా చేస్తున్న కన్ఫ్యూజన్ వల్లే నయనతార అభిమానులు తనని టార్గెట్ చేశారని అంటోంది.

గత కొంతకాలంగా నయనతార అభిమానులు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. గతంలో నయనతార యాక్టింగ్ తీరు గురించి మాళవిక సెటైర్లు వేసింది. తాజాగా తన కొత్త సినిమా ‘క్రిస్టి’ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాళవిక చేసిన ఒక కామెంట్ నయన్ అభిమానులకు కోపం తెప్పించింది.

“హీరోయిన్లను ప్రత్యేకంగా లేడి సూపర్ స్టార్ అనే పద్దతి నాకు నచ్చదు. అనాలనుకుంటే హీరోయిన్లని కూడా సూపర్ స్టార్ అంటే చాలు. లేడి అని జోడిస్తే నాకు నచ్చదు ,” అని మాళవిక ఈ ఇంటర్వ్యూలో చెప్పింది. నయనతార నటించే సినిమాల్లో ఆమెకి లేడి సూపర్ స్టార్ అనే పేరు పడుతుంది. దాంతో, మాళవిక అభిమాన హీరోయిన్ న్నే టార్గెట్ చేసి కామెంట్ చేసింది అని నయనతార ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. ఆమె వ్యా ఖ్య లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాళవికని తిట్టడం మొదలు పెట్టారు.

దాంతో, మాళవిక వివరణ ఇచ్చింది. తాను ఏ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు అని స్పష్టం చేసింది. ఒక సీనియర్ నటిగా నయనతార ఇష్టం, అలాగే ఆమె నుంచి స్ఫూర్తి పొందుతాను అంటూ క్లారిటీ ఇచ్చింది మాళవిక.

 

More

Related Stories