రష్మికకి నష్టమే లేదు!

రష్మిక మందాన పుట్టింది, పెరిగింది కర్ణాటకలో. ఆమె అచ్చమైన కన్నడ కస్తూరి. హీరోయిన్ గా మొదట అడుగుపెట్టింది కూడా కన్నడ చిత్రసీమలోనే . ఇప్పుడు ఆమె పాన్ ఇండియన్ స్టార్ అయింది. తమ ప్రాంతానికి చెందిన అమ్మాయి జాతీయస్థాయిలో పేరు తెచ్చుకుందని సంబరపడాల్సింది పోయి కన్నడ చిత్రసీమ ఆమె మీద కత్తి కట్టింది.

రష్మికపై బ్యాన్ పెట్టాలని కన్నడ చిత్రసీమ యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తల నేపథ్యంలో ఒక కన్నడ దర్శకుడు స్పందించారు. “రష్మికపై బ్యాన్ పెడితే ఎవరికీ నష్టం? ఆమె కన్నడ సినిమాల్లో నటించడం లేదు. తెలుగు, బాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉంది. ఆమె కన్నడంలో సినిమాలే చెయ్యట్లేదు. అలాంటప్పుడు ఆమెపై నిషేధం విధిస్తే ఆమెకి ఇంచు కూడా నష్టం జరగదు. ఇంకా చెప్పాలంటే మా పరిశ్రమకే నష్టం,” అని ఆ కన్నడ దర్శకుడు కుండబద్దలు కొట్టారు.

రష్మిక అప్పుడెప్పుడో ఓ ఇంటర్వ్యూలో తనకు మొదటి ఛాన్స్ ఇచ్చిన కన్నడ నిర్మాణ సంస్థ గురించి చెప్పలేదట. ఆ సంస్థ పేరు కూడా పలికేందుకు ఆమె ఇంటరెస్ట్ చూపలేదు అని కన్నడ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. దానికి తోడు, ఆమెని హీరోయిన్ గా పరిచయం చేసిన రిషబ్ శెట్టి కూడా రష్మికపై నెగెటివ్ గా మాట్లాడారు. ‘కాంతర’ సినిమాతో రిషబ్ శెట్టి ఒక్కసారిగా నేషన్ లెవల్లో పాపులర్ అయ్యారు.

Rashmika

దాంతో, రష్మికకి గర్వం అని కొందరు, బలుపు అని ఇంకొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాదు, ఆమెని బ్యాన్ చెయ్యాలంటూ కన్నడ చిత్రసీమకు చెందిన కొందరు డిమాండ్ చేస్తున్నారు. రష్మిక మాత్రం హాయిగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ ఫుల్లుగా సంపాదిస్తోంది.

 

More

Related Stories