పెళ్లి కాదు సహజీవనమే

- Advertisement -
Siddharth and Aditi Rao

కొత్త ఏడాది మొదటి రోజు తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ తో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేసి ఆదితి రావు అందరి దృష్టి తమ వైపు తిప్పుకొంది. ఆదితి రావు, సిద్ధార్థ్ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఆ విషయం మనకు తెలుసు. కానీ తమ లవ్వు గురించి ఇద్దరూ పబ్లిక్ గా మాట్లాడలేదు. ఇద్దరూ కలిసి కెమెరా ముందుకు వచ్చేందుకు ఇన్నాళ్లూ ఇష్టపడలేదు.

కొత్త ఏడాది 2024 మొదటి రోజే తమ ఫోటోని షేర్ చెయ్యడంతో ఇక వీళ్ళు తమ ప్రేమని దాచుకోవడం లేదని అర్థమైంది. ఐతే, తమ ప్రేమ వ్యవహారం గురించి జనాలకు న్యూ ఇయర్ సందర్భంగా చెప్పిన ఈ జంట ఈ ఏడాది పెళ్లి చేసుకుంటుందా?

సిద్ధార్థ్, ఆదితి మాత్రం పెళ్లి టాఫిక్ ఎత్తడం లేదు. వాళ్లకు ఆ ఆలోచన లేదని వారి మిత్రులు అంటున్నారు.

సిద్ధార్థ్, ఆదితి ఇద్దరికీ “పెళ్లి” కాన్సెప్ట్ కన్నా సహజీవనంపైనే ఆసక్తి. ఆదితి మొదటి పెళ్లి విడాకులకు దారి తీసింది. ఆ తర్వాత కొన్ని ప్రేమ వ్యవహారాలు కూడా చేదు జ్ఞాపకాలనే మిగిల్చాయి. ఇక హీరో సిద్ధార్థ్ సమంత, శృతి హాసన్, సోహా అలీ ఖాన్ ఇలా ఎందరో భామలతో సహజీవనం సాగించాడు. కానీ పెళ్లి వరకు రాలేదు. అందుకే, సిద్ధూ, ఆదితి ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచన చెయ్యకుండా “కలిసి” ఆనందంగా బతకాలని అనుకుంటున్నారు.

 

More

Related Stories