
రాజమౌళి, పవన్ కళ్యాణ్ మధ్య త్వరలోనే మీటింగ్ ఉంటుంది అని ఆ మధ్య చాలా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ని రాజమౌళి కలవలేదు. ఇద్దరి సినిమాల డేట్స్ మారలేదు.
“ఆర్ ఆర్ ఆర్” జనవరి 7న వస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన “భీమ్లా నాయక్” జనవరి 12న రానుంది. ఐతే, “భీమ్లా నాయక్” వాయిదా పడితేనే “ఆర్ ఆర్ ఆర్” లాభం లేదంటే… ఆరో రోజే చాలా థియేటర్లు “భీమ్లా నాయక్”కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రమాదం తప్పించేందుకు రాజమౌళి రంగంలోకి దిగాలని భావించిన మాట నిజమే. ఐతే, ఇప్పటివరకు రాజమౌళి, పవన్ కళ్యాణ్ మధ్య మీటింగ్ మాత్రం జరగలేదు.
ప్రస్తుతానికి, “భీమ్లా నాయక్” విడుదల తేదీలో ఏ మార్పు లేదు. పవన్ కళ్యాణ్ అదే డేట్ కి ఫిక్స్ అవ్వాలనుకుంటే రాజమౌళి కలిసి విజ్ఞప్తి చెయ్యకపోవచ్చు.
“భీమ్లా నాయక్” షూటింగ్ కి ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు. కానీ ఈ సినిమా నుంచి ఇప్పటికే నాలుగు పాటలు వచ్చాయి. కేవలం ఇంకో పాట మాత్రమే మిగిలి ఉంది. ఈ డిసెంబర్ 14న కూడా ఒక టీజర్ రానుంది. అంటే, పవన్ కళ్యాణ్ సినిమా విడుదల డేట్ లో దాదాపుగా మార్పు లేనట్లే.