బాఫ్టలో మొండిచెయ్యి

RRR

బ్రిటిష్ అకాడెమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్ట BAFTA) అవార్డులు కూడా ప్రపంచంలో గొప్ప అవార్డ్స్. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, బాఫ్ట… ఈ మూడు ప్రముఖమైనవి. ఇందులోనూ ఆస్కార్, బాఫ్ట అవార్డులకు ఎక్కువ విలువ ఉంటుంది. ఐతే, “ఆర్ ఆర్ ఆర్” సినిమాకి బాఫ్ట అవార్డు నామినేషన్ లలో చోటు దక్కలేదు.

ఇంగ్లీసేతర (విదేశీ) చిత్రం కేటగిరిలో ఈ సినిమాకి చోటు దక్కుతుందని అనుకున్నారు. లాంగ్ లిస్ట్ (పరిశీలన కోసం 10 చిత్రాలను సెలెక్ట్ చేసే లిస్ట్)లో “ఆర్ ఆర్ ఆర్” పేరు ఉంది. దాంతో, అవార్డు రాకపోయినా నామినేషన్ అయినా దక్కుతుందని భావించారు. కానీ, ఇంగ్లీసేతర (విదేశీ) కేటగిరిలో రాజమౌళి సినిమాకి చోటు దక్కలేదు.

ఇక్కడే మొండి చెయ్యి దక్కడంతో ఆస్కార్ అవార్డులల్లో అయినా నామినేషన్ దక్కుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఐతే, డాక్యుమెంటరీ విభాగంలో ఒక భారతీయుడు తీసిన “ALL THAT BREATHES” అనే డాక్యుడ్రామాకి నామినేషన్ దక్కింది.

 

More

Related Stories