
‘వకీల్ సాబ్’కి భయపడకుండా… వారం తరువాత తమ సినిమా వస్తుందని రిలీజ్ డేట్ ని ప్రకటించింది ‘లవ్ స్టోరీ’ టీం. ఆ తర్వాత వారం ‘టక్ జగదీష్’, ఆ వెంటనే.. తలైవి. అలాగే ఒక వారం గ్యాప్ లో ‘విరాట పర్వం’, ‘పాగల్’. కానీ ఇప్పుడు అన్ని వాయిదా పడ్డాయి. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ వంటి పెద్ద సినిమాకే ఫ్యామిలీ ప్రేక్షకుల అటెండెన్స్ పెద్దగా కనిపించడం లేదు. సో… ఈ టైంలో తమ సినిమాలకు అస్సలు బోణి ఉండదని ఈ సినిమాలు భయపడి వెనక్కి వెళ్లాయి. కొత్త డేట్స్ ని మెల్లగా ప్రకటిస్తారు.
మొత్తంగా మే మొదటి వారం వరకు ఇంతే. ‘ఇష్క్’ వంటి చిన్న సినిమాలు తప్ప నోటబుల్ స్టార్స్ ఉన్న సినిమాలేవీ ఇప్పట్లో థియేటర్ల ముఖం చూడవు.
దేశంలో ఒక్క టాలీవుడ్ మాత్రమే థియేటర్ల వ్యాపారం చూస్తోంది అని సంబరపడగానే సెకండ్ వేవ్ కరోనా ఉప్పెనలా వచ్చి విరుచుకుపడింది. ఇప్పుడు అంతా అతలాకుతలమే. మళ్ళీ పరిస్థితి కుదుటపడ్డాక, అన్ని సినిమాలు థియేటర్ల బాట పడుతాయి. కానీ అప్పుడు విడుదల డేట్స్ వెతుక్కోవడం కష్టం అవుతుంది. మొన్న ఫిబ్రవరి, మార్చి నెలలో ఒకే రోజు రెండు, మూడు సినిమాలు విడుదలయ్యాయి. అదే సీన్ రిపీట్ అవుతుంది.