![Mahesh Babu in Guntur Kaaram](https://telugucinema.com/wp-content/uploads/2024/01/maheshbabugunturkaaram.jpg)
“గుంటూరు కారం” సినిమా మొదటి రోజు భారీ వసూళ్లను పొందింది. మహేష్ బాబుకున్న స్టార్డం, మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ కి తగ్గట్లు ఫస్ట్ డే అద్భుతమైన కలెక్షన్లను అందుకొంది. ఈ సినిమాకి విడుదల రోజు ఒంటి (1 AM) గంటకి షోలు వేశారు. ఆ షోల వల్ల కొంత నష్టం జరిగింది అంటున్నారు నిర్మాతలు.
“ఉదయం షోలతో కొంచెం మిక్సెడ్ టాక్ వచ్చింది. కానీ సాయంత్రానికి సర్దుకొంది. ఇది పండగ సినిమా అని ఫిక్స్ అయింది ఇప్పుడు. కలెక్షన్లు చెపుతున్నాయి,” అని అంటున్నారు నిర్మాత నాగవంశీ.
ప్రముఖ నిర్మాత, ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా అదే మాట చెప్తున్నారు. “బాగున్న సినిమాని ఎవరూ ఆపలేరు. ఉదయం ఆటలతో కొంచెం మిక్సెడ్ టాక్ వచ్చిన మాట నిజమే. కానీ ఇది మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ మీద బేస్ చేసుకున్న సినిమా. తల్లీ కొడుకుల సెంటిమెంట్ తో కూడిన సినిమా. నేను నిన్న రెండోసారి సుదర్శన్ థియేటర్లో చూశాను.
నెగెటివ్ పోయింది. షో బై షో మంచి టాక్ పెరిగింది. ఇది పండగ పూట ఇంటిల్లిపాది చూడదగ్గ సినిమా,” అని దిల్ రాజు అన్నారు.