సోషల్ మీడియాలో ‘అల’ డల్!

Ala Vaikunthapurramloo

ఈ ఏడాది విడుదలైన తెలుగు సినిమాల్లో అతిపెద్ద హిట్ ‘అల వైకుంఠపురంలో’. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా పాటలు అంతకన్నా పెద్ద హిట్. ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఐతే, ఈ సినిమా కానీ, ఈ సినిమా హీరో అల్లు అర్జున్ కానీ, హీరోయిన్ పూజ హెగ్డే కానీ సోషల్ మీడియాలో పెద్దగా పాపులర్ కాదని ప్రూవ్ అయింది.

2020 అధికంగా సెర్చ్ చేసిన గూగుల్ పదాల్లో అల్లు అర్జున్ కి చోటు దక్కలేదు. ‘అల వైకుంఠపురంలో’ సినిమా కూడా ట్రెండ్ కాలేదు.

అలాగే, లేటెస్ట్ గా ట్విట్టర్ విడుదల చేసిన 2020 ట్రేండింగ్ మూవీస్ లో ఈ సినిమా సోదిలో కూడా లేదు. టాప్ 10 సౌత్ ఇండియన్ సినిమాల లిస్ట్ లో “సరిలేరు నీకెవ్వరు”కి చోటు దక్కింది, అలాగే అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న “పుష్ప”కి ప్లేస్ ఉంది కానీ ‘అల వైకుంఠపురంలో’ 2020లో పెద్దగా ట్విట్టర్లో ట్రెండ్ కాలేదు.

అలాగే, అత్యధికంగా ట్వీట్లు పొందిన హీరోల లిస్ట్ లో టాప్ ప్లేస్ మహేష్ బాబుకి దక్కింది. అల్లు అర్జున్ ఆరో స్తానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హీరోయిన్ పూజ హెగ్డే కూడా కీర్తి సురేష్, సమంత, రష్మికల తర్వాత చోటు సంపాదించుకొంది.

ఓవరాల్ గా, ట్విట్టర్ లో, గూగుల్ ట్రెండ్స్ లో “అల” అలా డల్ గా నడిచింది.

Advertisement
 

More

Related Stories