సూపర్ మచ్చిని పట్టించుకునేవారేరి!

సంక్రాంతి స్పెషల్ గా నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ ప్రచారం పొందినవి మాత్రం మూడే. ‘బంగార్రాజు’, ‘రౌడీ బాయ్స్’, ‘హీరో’… ఈ మూడు చిత్రాలు ప్రచారంలో దూసుకుపోయాయి. కానీ ‘సూపర్ మచ్చి’ అనే మరో సినిమా కూడా బరిలో ఉందనే విషయమే జనాలకు తెలీదు.

మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన చిత్రం ఇది. కానీ ఎక్కడా సందడి లేదు. ప్రచారం లేదు. పులి వాసు దర్శకుడిగా రూపొందిన ఈ మూవీ జనవరి 14న థియేటర్లోకి వస్తోంది. ఈ సినిమా హీరో కల్యాణ్ దేవ్ కూడా బయటికి వచ్చి ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు.

“పెద్ద సినిమాలున్నా కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామంటే ఈ సినిమా మీద మాకున్న నమ్మకమే కారణం,” అంటూ దర్శకుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. నమ్మకం సంగతి దేవుడెరుగు సినిమా విడుదల అవుతోందన్న విషయం జనాలకి తెలియాలి కదా.

అటు హీరో కళ్యాణ్ దేవ్, ఇటు చిరంజీవి కుటుంబం ఈ సినిమాని ఎందుకు పట్టించుకోవడం లేదో!

 

More

Related Stories