దీపావళికి టీజర్ రావట్లేదు సాబ్!

Pawan Kalyan

ఈ దీపావళికి ‘వకీల్ సాబ్’ టీజర్ లేదనే విషయం ఆల్రెడీ తేలిపోయింది. ఇదే విషయాన్ని తెలుగుసినిమా.కామ్ కూడా కొన్ని రోజుల కిందట స్పష్టంచేసింది. అయితే కొంతమంది ఫ్యాన్స్ కు మాత్రం ఇంకా ఆశ చావలేదు. టీజర్ కు సంబంధించి ఈరోజు అప్ డేట్ వస్తుందంటూ పొద్దున్నుంచి కొందరు సోషల్ మీడియాలో ఎదురుచూస్తూనే ఉన్నారు.

మొత్తమ్మీద దీపావళికి టీజర్ లేదనే విషయం తేలిపోయింది. ఐతే, కనీసం టీజర్ లేదని చెబితే తమకు ఈ నిరీక్షణ తప్పేదని సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తంచేస్తున్నారు అభిమానులు.

‘వకీల్ సాబ్’ విడుదలపై దిల్ రాజు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఎందుకంటే ఇది ఓటీటీకి ఇచ్చే సినిమా కాదు. థియేటర్లు ఎప్పటికి పూర్తిస్థాయిలో తెరుచుకుంటాయో ఆయన ఓ క్లారిటీకి రావాలి. పరిస్థితులన్నీ అంచనా వేసుకొని, సంక్రాంతికి రావాలా లేక సమ్మర్ కు రావాలా అనే విషయాన్ని డిసెంబర్ లో నిర్ణయిస్తాడు దిల్ రాజు. అందుకే టీజర్ ను విడుదల చేయడం లేదు.

Related Stories