శంకర్ ని వెంటాడుతున్న పాత కేసు

శంకర్ ని వెంటాడుతున్న పాత కేసు

గ్రేట్ డైరెక్టర్ శంకర్ కి ఇటీవల అన్ని చిక్కులే ఎదురవుతున్నాయి. పరాజయాలతో పాటు మరెన్నో చికాకులు అతన్ని కలవరపెడుతున్నాయి. ఎప్పుడో మొదలుపెట్టిన ‘భారతీయుడు 2’ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియని స్థితి.

ఇక ‘రోబో’ సినిమా కథ నాది అంటూ ఒక రచయిత వేసిన కేసు పదేళ్ల నుంచి ఆయన్ని వెంటాడుతోంది. లేటెస్ట్ గా ఈ కేసులో శంకర్ అరెస్ట్ కి వారెంట్ జారీ అయింది. అది కూడా నాన్ బెయిలబుల్ వారెంట్. అంటే, ఇక విచారణకి శంకర్ హాజరు కావలిసిందే. ఫిబ్రవరి 19కి కేసు విచారణ వాయిదా పడింది.

తాను రాసుకున్న ఒక కథని శంకర్ కొంత మార్చి ‘రోబో’గా తీసాడని ఒక తమిళ రచయిత పదేళ్ల క్రితం కేసు వేశాడు. పదేళ్లుగా కేసు వాయిదా పడుతూ వస్తోంది. ఎన్నిసార్లు కోర్టుకు హాజరు కావాలని చెప్పినా…శంకర్ రావడం లేదని ఇప్పుడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు చెన్నైలోని ఎగ్మోర్ మేజిస్ట్రేట్.

More

Related Stories