
కేజీఎఫ్ (KGF: Chapter 1) మొదటి భాగంలో సౌత్ ఇండియన్ వెర్షన్స్ కోసం తమన్నాతో ఐటెం సాంగ్ చేయించారు. హిందీలో మౌనిరాయ్ అనే భామ ఐటెం సాంగ్ చేసింది. ఇప్పుడు రెండో భాగంలో కూడా అలాగే చేస్తున్నారట.
రెండో భాగం (KGF Chapter 2)లో ఐటెం సాంగ్ ని నోరా ఫతేహి డ్యాన్స్ చేసింది. ఆమె ఐటెం సాంగ్స్ కి పెట్టింది పేరు.
అమితాబ్ సినిమా ‘షోలే’లోని “మెహబూబా… మెహబూబా” పాటని హిందీలో రీమిక్స్ చేస్తున్నారట. ఈ రీమిక్స్ గీతంలో నోరా నటించిందట. త్వరలోనే ఈ సాంగ్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది.
‘కేజీఎఫ్ 2’ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి. ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఐతే, ఇంకా పబ్లిసిటీ మొదలు పెట్టలేదు ఈ టీం. ఈ ఐటెం సాంగ్ తోనే ప్రచారం స్టార్ట్ చేస్తారేమో.
ఏప్రిల్ 14న ‘కేజీఎఫ్ 2’ వస్తుందనే ఉద్దేశంతో తెలుగు నిర్మాతలు, హీరోలు ఆ సినిమాకి డేట్ వదిలేశారు. ఐతే, అదే రోజు విజయ్ నటిస్తున్న “బీస్ట్” విడుదల కానుంది.