ఎనిమిదేళ్ల తర్వాత…!

- Advertisement -
Nora Fatehi

నోరా ఫతేహి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఆమె అందచందాలు, ఆమె డ్యాన్స్ స్టెప్పులు మనం చాలా చిత్రాల్లో చూశాం. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ఆమె తాజాగా వరుణ్ తేజ్ సినిమా ఒప్పుకొంది.

కెనెడాలో పుట్టి మొరాకోలో పెరిగి ముంబైలో మోడల్ గా స్థిరపడి ఆ తర్వాత ఐటెంగాళ్ గా మారింది ఈ భామ. 31 ఏళ్ల ఈ సుందరిని పూరి జగన్నాధ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ” టెంపర్” సినిమాలో “ఇట్టాగే రెచ్చిపోదాం” పాటలో డ్యాన్స్ చేసింది. అలా మొదలైంది తెలుగులో ఆమె ఐటెంసాంగ్ ల ప్రస్థానం.

ఆ తర్వాత “బాహుబలి” “కిక్ 2”, “లోఫర్, “ఊపిరి” వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. కానీ “ఊపిరి” తర్వాత ఆమె పూర్తిగా హిందీ సినిమాలకే పరిమితం అయింది. అక్కడే అనేక చిత్రాల్లో తన ఆటపాటలతో ఊపేసింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ భామ మళ్ళీ తెలుగులోకి అడుగుపెడుతోంది.

వరుణ్ తేజ్ “మట్కా” అనే ఒక కొత్త చిత్రం అంగీకరించారు. ఆ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. రెండో పాత్రలో నోరా నటించనుంది. ఇంతకుముందు ఈ భామ వరుణ్ తేజ్ తో “లోఫర్” మూవీ చేసింది. 8 ఏళ్ల తర్వాత వరుణ్ తేజ్ తో మరోసారి డ్యాన్స్ చేయనుంది.

More

Related Stories