డ్యాన్స్ తోనే తమన్నాకు ఆనందం

Tamannaah

తమన్నా అద్భుతమైన డ్యాన్సర్. ‘రచ్చ’ సినిమాలో రామ్ చరణ్ తో వేసిన ఆమె స్టెప్పులు చూసి డ్యాన్స్ లో కింగ్ అనిపించుకున్న మెగాస్టార్ కూడా ఫిదా అయిపోయారు. ఆమెతో డ్యాన్స్ చెయ్యాలని ఉంది అనే అప్పట్లోనే అన్నారు. ఇప్పుడు ‘భోళాశంకర్’ సినిమాలో చిరంజీవి, తమన్న మధ్య ఆ డ్యాన్స్ పోటీ చూడొచ్చు.

మరోవైపు తమన్నా కూడా తనకు డ్యాన్స్ మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది అని చెప్తోంది. తన చిన్ననాటి ఫోటోని ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది తమన్న. చిన్నప్పుడే మంచి స్టెప్పులేస్తోన్న తమన్నా ఫోటో అది. అలాగే బీచ్ లో డ్రింక్ ని ఆస్వాదిస్తూ డ్యాన్స్ చేస్తున్న నేటి వీడియోని కూడా షేర్ చేసింది. నాడైనా, నేడైనా తాను డ్యాన్స్ బేబీ అని చెప్తోంది.

ఇది ఆమె పోస్ట్ : “This throwback reminded me that since childhood nothing made me a happy as dancing to my favourite songs. No matter what happens… just dance!” ( చిన్నప్పటి నుంచి నాకు ఇష్టమైన పాటలకు డ్యాన్స్ చెయ్యడం తప్ప మరేది అంత ఆనందం కలిగించలేదు. ఈ పాత ఫొటోతో ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. డ్యాన్స్ చెయ్యండి చాలు.)

ప్రస్తుతం ఈ మిల్క్ బ్యూటీ రెండు వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఒకటి ‘జీ కర్దా’, మరోటి ‘లస్ట్ స్టోరీస్ 2’. రెండింటిలోనూ ఈ భామ హాట్ హాట్ సీన్స్ చేసిందిట.

‘జీ కర్దా’ అనే వెబ్ సిరీస్ ప్రచారం కోసమే ఈ పోస్ట్ పెట్టింది తమన్న. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో ఆమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఒక పాటలో స్టెప్పులేస్తోంది. ‘భోళా శంకర్’ సినిమా కోసం ఒక ఫ్యామిలీ సెలెబ్రేషన్ పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో చిరంజీవి, తమన్నా జంటగా డ్యాన్స్ చేస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లిగా స్టెప్పులేస్తోంది.

 

More

Related Stories