ఇక మెగా ప్రమోషన్ మొదలు!

- Advertisement -
Acharya


అనేక సినిమాలు ఒప్పుకొని, నాలుగు సినిమాల్లో నటిస్తున్న బిజీయెస్ట్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవే. కెరియర్ ప్రారంభంలో ఎలా ఐతే మూడు నాలుగు సినిమాల్లో నటించేవారో ఇప్పుడు అలా చేస్తున్నారు. ఆయనకున్న కారణాలు, లెక్కలు ఏవైనా ఇప్పుడు ఆయన కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే.

‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలైంది కాబట్టి ఇక ఇప్పుడు తన సినిమా ప్రచారం చేసుకోవాలి. “ఆర్ ఆర్ ఆర్” కోసమే “ఆచార్య” సినిమాని వాయిదా వేశారు. ఒప్పందం ప్రకారం “ఆర్ ఆర్ ఆర్”కి ముందు “ఆచార్య” చిత్రాన్ని విడుదల చేయకూడదు. “బిగ్గెస్ట్ మల్టీస్టారర్” అనే ముద్ర తమ సినిమాకే ముందు ఉండాలి అనేది రాజమౌళి పెట్టిన కండీషన్. అందుకే, రిలీజ్ తో పాటు ప్రచారం కూడా ఆపేశారు.

ఇపుడు రాజమౌళి సినిమాతో భారీ ఓపెనింగ్స్ అందుకున్న రామ్ చరణ్ ఇంకా ఉత్సాహంగా తన తండ్రి చిరంజీవితో కలిసి ప్రొమోషన్ మొదలు పెట్టనున్నారు. ‘ఆచార్య’లో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించారు. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకుడు. మూడేళ్ళుగా నిర్మాణంలో ఉంది. ఎన్నిసార్లు వాయిదాపడినా … చివరి నిమిషంలో గట్టిగా ప్రచారం చేస్తే ఓపెనింగ్ అదిరిపోతుంది అని రాజమౌళి నిరూపించారు.

సో… మెగాస్టార్ కూడా “ఆచార్య” ప్రచార పరంపరకి సిద్ధం కానున్నారు.

 

More

Related Stories