ఎన్టీఆర్ పై హాలీవుడ్ చూపు!

NTR


ఎన్టీఆర్ కి ‘ఆర్ ఆర్ ఆర్’ చాలా హెల్ప్ చేసింది. సినిమా విడుదలైన టైమ్ లో ఎన్టీఆర్ కి అన్యాయం జరిగింది అన్న కామెంట్స్ వినిపించాయి. రామ్ చరణ్ కి ఎక్కువ పాత్ర ఇచ్చి రాజమౌళి ఎన్టీఆర్ స్థాయి తగ్గించాడని విడుదలైన మొదటి రెండు రోజులు సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. ఐతే, సినిమా కలెక్షన్లు చూశాక, ఆ హడావిడి తగ్గింది. సినిమా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కి పాన్ ఇండియా, పాన్ వరల్డ్ పేరు తెచ్చిపెట్టింది.

ఇప్పుడు ఆస్కార్ అవార్డుల రేసులో నిల్చింది ఈ మూవీ. ఇటీవల ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఒక ఏషియన్ సినిమాకి ఈ అవార్డు రావడం ఇదే మొదటిసారి. దాంతో, అందరి చూపు మన హీరోలపై పడింది.

ఇక ఎన్టీఆర్ కొన్నాళ్లుగా అమెరికాలోనే మకాం వేసి అక్కడి మీడియాతో బాగా ఇంటరాక్ట్ అవుతున్నాడు. అమెరికన్ మీడియా మంచి పబ్లిసిటీ కల్పించింది ఎన్టీఆర్ కి. అంతేకాదు, అమెరికన్ నిర్మాణ సంస్థలు తనని అప్రోచ్ అయితే హాలీవుడ్ సినిమాలు చేస్తాను అని చెప్తున్నాడు.

ఎన్టీఆర్ సీరియస్ గానే గ్లోబల్ మార్కెట్ పై ఫోకస్ పెట్టాడట. ఒకవేళ ఏదైనా హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వస్తే వదులుకోను అని తన సన్నిహితులకు చెప్తున్నట్లు టాక్.

 

More

Related Stories