- Advertisement -

దిల్ రాజు 50వ బర్త్ డే సంబరాలకు దాదాపుగా నేటితరం టాప్ హీరోలందరూ హాజరయ్యారు. పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మహేష్ బాబు ఐతే ఏకంగా రాత్రి ఒంటి గంట వరకు పార్టీలో టైం స్పెండ్ చేశారట. ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, రామ్, నితిన్… ఇలా ఒకరా ఇద్దరు… అందరూ విచ్చేశారు. రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్, రానా… ఇలా కొందరు మాత్రమే రాలేదు.
కానీ టాప్ హీరోల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ మిస్ కొట్టడం కొట్టడం విచిత్రమే. అల్లు అర్జున్ లైఫ్ టర్న్ చేసిందే నిర్మాత దిల్ రాజు. . అల్లు అర్జున్ “పుష్ప” నైట్ షూటింగ్ లో ఉన్నాడు. అందుకే రాలేకపోయాడు అని అంటున్నారు. ఎన్టీఆర్ ఎందుకు రాలేదో మరి. ఎన్టీఆర్ తో రెండు సినిమాలు కూడా నిర్మించాడు దిల్ రాజు.