ఎన్టీఆర్, చరణ్ ర్యాంకులు అదుర్స్

- Advertisement -
NTR and Ram Charan

టైమ్స్ ఆఫ్ ఇండియా ఏటా ప్రకటించే ‘మోస్ట్ డిజైరబుల్’ లిస్ట్ చాలా చిత్రవిచిత్రంగా ఉంటుంది. ‘రకరకాల’ విషయాలు వారిని ప్రభావితం చేస్తాయి. అందుకే లిస్ట్ లో కొందరి పేర్లు చూస్తే నవ్వుకోవడం తప్ప ఏమి చేయలేం. ఐతే, ఈ ఏడాది (2020 లిస్ట్) ప్రకటించిన వాటిలో రెండు స్థానాలు కొంత ప్రత్యేకంగా కనిపించాయని చెప్పొచ్చు.

2019లో 19వ స్థానంలో ఉన్న ఎన్టీఆర్ ఏకంగా ఈ ఏడాది 3వ స్థానానికి ఎగబాకడం విశేషం. ఇక రామ్ చరణ్ గతేడాది రెండో స్థానంలో ఉండగా ఈసారి రెండు స్థానాలు దిగాల్సి వచ్చింది. మొదటి స్థానంలో విజయ్ దేవరకొండ, రెండో స్థానంలో రామ్ ఉన్నారు.

అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ “ఆర్ ఆర్ ఆర్” సినిమా కోసం తమ శరీరాలను సూపర్ గా తీర్చిదిదుకున్నారు. సిక్స్ ప్యాకులు, ఎయిట్ ప్యాకులతో ముస్తాబయ్యారిద్దరూ. అందుకే కాబోలు ‘మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020’ లిస్ట్ లో టాప్ 5లోకి చేరారు ఎన్టీఆర్, రామ్ చరణ్.

 

More

Related Stories