ఎన్టీఆర్ తో యువ క్రికెటర్స్

‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. అలాగే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం, ఆస్కార్ అవార్డుల పోటీలో ఉండడంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు మార్మోగుతున్నాయి. ఎన్టీఆర్ కూడా తన ఇమేజ్ ని మరింత పెంచుకునే పనిలో ఉన్నారు.

తాజాగా కొందరు ఇండియన్ క్రికెటర్స్ ఎన్టీఆర్ ని కలిసి పార్టీ చేసుకున్నారు. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీంలో మంచి ఫామ్ లో ఉన్న క్రికెటర్… సూర్య కుమార్ యాదవ్. ఈ కుర్ర క్రికెటర్ ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

టీమిండియా యువ క్రికెటర్స్ యాదవ్, చాహల్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్ వంటివారు ఎన్టీఆర్ తో కలిసి ఫోటోలు దిగారు. ఎన్టీఆర్ వారికి హైదరాబాద్ లో పార్టీ ఇచ్చినట్లు టాక్. ఇందులో కొందరు క్రికెటర్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వాటిని షేర్ చేశారు. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.

అమెరికా టూర్ నుంచి ఇండియాకి ఇటీవలే తిరిగి వచ్చారు ఎన్టీఆర్. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కనుక ఆస్కార్ కి నామినేట్ అయితే మళ్ళీ అమెరికా వెళ్తారు. మరోవైపు, వచ్చే నెలలో దర్శకుడు కొరటాల శివతో కొత్త సినిమా ప్రారంభిస్తారు.

 

More

Related Stories